చిల్లీ’ చికెన్

VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)

కావల్సిన పదార్థాలు:

– బోన్ లెస్ చికెన్ 500 గ్రాములు (చిన్నిచిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి)
– పేలాల పిండి 4 టేబుల్ స్పూన్లు,
– పచ్చిమిరపకాయలు 4 ( సన్నగా తరుగుకోవాలి),
– సోయా సాస్ 4 టేబుల్ స్పూన్లు,
– టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్లు,
– ఉల్లిపాయలు 2 ( సన్నగా తరిగినవి),
– వెల్లులి రెబ్బలు 6 ( సన్నగా తరుగుకోవాలి),
– ఉల్లికోళ్లు 4 (ముక్కలుగా కోసుకోవాలి).
– బెంగుళూరు మిరిపకాయ 1 (సన్నటి ముక్కలుగా కోసుకోవాలి),
– అల్లం, వెల్లులి పేస్ట్ 2 టీ స్పూన్లు,
– ఆలివ్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు,
– చైనా గ్రాస్
– సాల్ట్ తగినంత,

తయరీ విధానం :

– తొలత మాంసపు ముక్కలను అల్లం, వెల్లులి మిశ్రమంలో సాల్ట్ ను కలిపి నానబెట్టుకోవాలి.
– గిన్నెలోకి కొద్దిగా నీరు తీసుకుని అందులో పేలాల పిండిని వేసి తరుగుకున్న సగం పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. తరువాత మాంసపు ముక్కలను వేసి కలుపుకోవాలి.
– లోతైన పాన్ లో నూనెను వేడి చేసుకుని చికెన్ ముక్కలను వేయించి పక్కనపెట్టకోండి.
– అనంతరం తరుగుకున్న ఉల్లిముక్కలను బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, అందులో వెల్లులి రెబ్బలను కలిపి తాలింపు పెట్టుకోండి. అనంతరం తరుగుకున్న ఉల్లికోళ్లతో పాటు బెంగుళూరు మీర్చి, మిగిలిన పచ్చిమిర్చి తరుమును వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.
– తరవాత ఉడుకుతున్న మిశ్రమంలో టమోటో సాస్, సోయా సాస్ లను వేసి ఉడికించికండి. బాగా ఉడికిన తరువాత ఫ్రై చేసుకుని సిద్ధంగా ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి.
– ఉడుకుతున్న మిశ్రమంలో 1 కప్పు నీటితో పాటు చైనా గ్రాస్ మరియు సాల్ట్ ను కలపండి.
– పాన్ పై మూతపెట్టి 10 నిమిషాలు తక్కువ వేడిలో ఉడికించుకోండి, ముక్కలు బాగా ఉడికిన తరువాత పాన్ లో నీరు ఆవిరయ్యేందుకు వేడిమిని కాస్త పెంచుకోండి.
– అంతే.. మీరు ఎదురుచూస్తన్న ‘చిల్లీ’ చికెన్ వంటకం తయారైనట్లే.

VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)
VN:F [1.9.18_1163]
Rating: 0 (from 0 votes)
No votes yet.
Please wait...
0.00 avg. rating (0% score) - 0 votes

Most Popular Recipes

Chicken Recipe Booklet 2022
Vencobb Fresh Chicken

“It is my dream to see Indiavas the number one position on the Poultry map of the world.

+more
Reshmi Kabab
Chicken Recipe Booklet 2021
Chicken Recipe Booklet 2020