చెట్టినాడ్ కోడి వేపుడు (chettinad kodi vepudu)

VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)

కావలసినవి:
చికెన్ – 500 గ్రా//
ఉల్లిపాయలు – 4
టమాటాలు పెద్దవి – 2
కరివేపాకు – 4 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్స్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – 1 కప్పు

మసాలా ముద్ద కోసం కావలసినవి:
ధనియాలు – 2 టీ స్పూన్స్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
ఎండుమిర్చి – 8
మిరియాలు – 1/2 టీ స్పూన్
అనాసపువ్వు – 1
మరాఠీ మొగ్గ – 2

తయారు చేసే విధానం:

  • శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలకి ఉప్పు,పసుపు పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • మసాలా ముద్ద కోసం తీసుకున్న వస్తువులనన్నిటినీ సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి.
  • వేయించుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్తని ముద్దగా రుబ్బుకోవాలి.
  • ఈ ముద్దలో నుండి కొద్దిగా తీసుకుని ముందే మారినేట్ చేసిన చికెన్ ముక్కలకి పట్టించుకోవాలి.
  • ఒక గిన్నెలో చికెన్ వేసి నీరు ఇంకే వరకు ఉడికించుకోవాలి.
  • తర్వాత బాణలిలో నూనె పోసి వేడి చెయ్యాలి.ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్నివేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇదే నూనెలో ఉల్లిపాయముక్కలు,అల్లంవెల్లుల్లి పేస్ట్,మిగిలిన మసాలాముద్ద వేసి దోరగా వేయించుకోవాలి.ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి 5 నిమిషాలు వేగనివ్వాలి.
  • ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి కూర ఫ్రై గా అయ్యేవరకు వేయించి,
  • కరివేపాకు కొత్తిమీర చల్లుకుని దించేయాలి.
VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)
VN:F [1.9.18_1163]
Rating: 0 (from 0 votes)
No votes yet.
Please wait...
0.00 avg. rating (0% score) - 0 votes

Most Popular Recipes

Chicken Recipe Booklet 2022
Vencobb Fresh Chicken

“It is my dream to see Indiavas the number one position on the Poultry map of the world.

+more
Reshmi Kabab
Chicken Recipe Booklet 2021
Chicken Recipe Booklet 2020